మలయాళ దర్శకుడితో ప్రభాస్ భేటీ
‘కిష్కింధ కాండం’ ఫేమ్ మలయాళ దర్శకుడు దినజిత్ అయ్యతన్‌తో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్‌గా భేటీ అయ్యాడు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో SMలో వైరల్ అవుతోంది. హోంబలే ఫిల్మ్స్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్‌తో వరుస సినిమాలు ప్లాన్ చేసిన హోంబలే, ఈ ప్రాజెక్ట్‌ను కూడా పట్టాలెక్కించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.