'స్వచ్ఛ ఆంధ్ర ఉద్దేశ్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి'

PPM: మన్యం జిల్లావ్యాప్తంగా 4వ శనివారం జరగనున్న స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమ ఉద్దేశ్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఛాంబరు నుంచి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమ నిర్వహణ, అవార్డులపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.