రఘుపతి గుట్టపై ప్రత్యేక పూజలునిర్వహించిన డీఎస్పీ

రఘుపతి గుట్టపై ప్రత్యేక పూజలునిర్వహించిన డీఎస్పీ

MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో వెలసిన రఘుపతి గుట్ట సీతారామచంద్ర స్వామి వారిని డీఎస్పీ సురేందర్ గౌడ్, ఎస్ఐ బాలరాజు శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం, సర్పంచ్ బండారి శ్రీనివాస్ గౌడ్ మరియు ఆలయ కమిటీ చైర్మన్ కట్ట ప్రహ్లాద్ అధికారులు వారికి స్వామి వారి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.