'సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'
SRPT: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ప్రజలు ఆర్థికంగా నష్టపోవద్దని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఏపూరు శాఖ మేనేజర్ రామకృష్ణ సూచించారు. బుధవారం రామన్నగూడెంలో బ్యాంకు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తీసుకున్న క్రాప్ లోన్లను సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని కోరారు. సర్పంచ్ రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు.