'పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

SRPT: పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కౌన్సిలర్ చిరివెర్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 27వ వార్డులో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి మాట్లాడారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం రెండు పోలియో చుక్కలు ప్రతి తల్లిదండ్రులు వేయించాలన్నారు.