'కార్మిక చట్టాలు అములు చేయాలి'
AKP: కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను అమలు చేయాలని కశింకోట సీటు కార్యదర్శి డీ. శ్రీనివాస్ కోరారు. వివిధ కార్మిక సంఘాలుతో కశింకోట పొట్టి శ్రీరాములు పార్కు నుంచి ర్యాలీగా బయలుదేరి జాతీయ రహదారి మీదుగా తహసీల్దార్ కార్యాలయం చేరారు. అక్కడ ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేసి తహసీల్దార్‌కు డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రం సమర్పించారు.