దేవాదాయశాఖ అధికారి శాంతికి మరోసారి కస్టడీ

దేవాదాయశాఖ అధికారి శాంతికి మరోసారి కస్టడీ

AP: దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ కార్యాలయంలో ఇవాళ, రేపు అధికారులు ప్రశ్నించనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విజయవాడలోని జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో శాంతి ఉన్నారు. ఇటీవల ఆమెను రెండు రోజులు కస్టడీకి తీసుకుని అధికారులు విచారించారు. సరైన సమాధానాలు చెప్పకపోవడంతో మరోసారి కస్టడీకి తీసుకుంటున్నారు.