ఏలూరు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ నియామకం

ELR: ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కట్నేని లక్ష్మీ కృష్ణ ప్రసాద్‌ను, రాష్ట్ర ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్‌గా మంగళవారం నియమించారు. పార్టీకి క్రమశిక్షణతో సేవలందిస్తున్న ఆయనకు ఈ అవకాశం లభించడంతో పలువురు ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం 12 మంది డైరెక్టర్లలో ఒకరిగా ఎంపికైన ఆయనకు బీజేపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు.