హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన

హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన

కృష్ణా: గుడివాడ మండలం మోటూరు క్రాస్ రోడ్స్‌లో హెల్మెట్ వినియోగంపై ఎస్ఐ చంటిబాబు వాహనదారులకు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.