'పార్టీ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు'
MLG: మంగపేట మండల కేంద్రంలోని కమలాపురం గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జయరాం రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికి అధిష్టానం టికెట్ కేటాయించిన వారి గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు చేపడతామని హెచ్చరించారు.