శ్రీ ఏడుపాయలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో వన దుర్గమ్మకు రాజగోపురం వద్ద సోమవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు. శ్రావణ 4వ సోమవారం సందర్భంగా అమ్మవారికి పంచామృతాలు, మంజీరా నది పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహా మంగళ హారతి సమర్పించారు.