VIDEO: జిల్లాలో భారీ వర్షం.. రైతులు ఆనందం

BHPL: జిల్లా కేంద్రంలోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. గత వారం రోజులుగా వర్షాలు లేక ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేడు కురిసిన వర్షం రైతులకు ఆనందం కలిగించింది. ఈ వర్షం పంటలకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు తెలిపారు. వ్యవసాయ కార్యకలాపాలకు ఈ వర్షం ఊపిరిలా మారిందని వారు సంతోషం వ్యక్తం చేశారు.