అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: బిక్కవోలు(మం) మేళ్లూరులోని చవ్వాకుల పెద భూలోకం జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ముందుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పాఠశాలలో నిర్మించిన ఆర్వో ప్లాంట్‌ను, వాలీబాల్ కోర్ట్‌ను, సైకిల్ స్టాండ్ షెడ్డు‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.