VIDEO: సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో బోనాల సమర్పణ

NLG: చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు, శివనేనిగూడెంలో గురువారం ముత్యాలమ్మ తల్లికి ప్రజలు బోనాలు సమర్పించారు. గుడి వద్ద వీధి దీపాల సౌకర్యం లేకపోవడంతో సెల్ ఫోన్ లైట్స్ వెలుతురుతో ముత్యాలమ్మకు మహిళలు బోనాలను సమర్పించారు. బోనాలకు ఏర్పాట్లు చేయాలని ముందుగా వినతిపత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.