ట్రాలీ చోరీ.. కేసు నమోదు

ట్రాలీ చోరీ.. కేసు నమోదు

SRD: ట్రాక్టర్ ట్రాలీ చోరీకి గురైందని సిర్గాపూర్ ఎస్సై వెంకట్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మండలంలోని రూప్లాతాండకు చెందిన జాదవ్ పర్లాల్ శనివారం ఉజులంపాడు శివారులోని జొన్నచేనులో ట్రాలీని ఉంచాడు. అదే రాత్రి 9 గంటలకు ట్రాలీ చోరీకి గురైంది. చుట్టుపక్కల వెతికిన దొరకలేదు. పర్లాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.