మెడికల్ విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన

మెడికల్ విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన

NLG: ర్యాగింగ్ అనే విష సంస్కృతికి విద్యార్థులు దూరంగా ఉండాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడి జైలుకు వెళ్లి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. నల్గొండలోని మెడికల్ కాలేజీలో సోమవారం విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కల్పించారు. జూనియర్లతో సోదర భావంతో మెలగాలని, తాము కూడా ఒకప్పటి జూనియర్లమేనని సీనియర్లు గ్రహించాలని పేర్కొన్నారు.