జాగ్రత్త.. చలి వణికిస్తోంది!
చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు ఉదయం, రాత్రి వేళల్లో శరీర వేడిని కోల్పోకుండా స్వెట్టర్లు, చేతులకు గ్లౌజులు ధరించాలి. వేడి సూప్‌లు, గోరువెచ్చని నీళ్లు వంటివి తరచుగా తీసుకుంటూ ఉండాలి. వృద్ధులు, పిల్లలు చలిలో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. చలి వల్ల చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి. పొగమంచులో వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలి.