పోలింగ్ సామాగ్రిని పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన సీపీ
HNK: ఆత్మకూర్ దామెర మండలాలలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సీపీ సన్ ప్రీత్ సింగ్ పోలింగ్ పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాలెట్ పత్రాలు తరలించేటప్పుడు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఆవంచనయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.