ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
WGL: దశ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి చెన్నారావుపేటలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు.