VIDEO: యూరియా కోసం కన్నెర్ర చేసిన రైతులు

RR: కేశంపేట మండల కేంద్రంలో రైతులు యూరియా కోసం కన్నెర్ర చేశారు. సోమవారం ఉదయం యూరియా కోసం రైతులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. యూరియా తక్కువగా ఉండి రైతులు అధికంగా రావడంతో అక్కడ కొద్దిసేపు గలాటా ఏర్పడింది. రైతుల వద్దకు చేరుకున్న PACS ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డిని రైతులు చుట్టుముట్టారు.