చనగల కేంద్రాన్ని ప్రారంభించిన కరుణా తిరుపతమ్మ
ప్రకాశం: పొన్నలూరు మండలం చెన్నుపాడులో సెనగల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కర్ణ తిరుపతమ్మ మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో క్వింటా శనగలు రూ.5,875 కొనుగోలు చేస్తుండగా బయట మార్కెట్లో వ్యాపారస్తులు రూ.5 వేల లోపే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కందులు సెనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయం అని అన్నారు.