ఆగస్టు 29న కేబినెట్ సమావేశం

TG: రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆగస్టు 29న మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ ఉండనుంది. బీసీ రిజర్వేషన్లు, అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు, సర్పంచ్ ఎన్నికలు, కాళేశ్వరం నివేదికపై ఈ భేటీలో చర్చించనున్నారు. కాగా, సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.