పాఠశాలను సందర్శించిన డీఈవో

పాఠశాలను సందర్శించిన డీఈవో

మెదక్ పట్టణంలోని గాంధీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను డీఈవో విజయ సందర్శించారు. తరగతి గది బోధనా అభ్యసన ప్రక్రియ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మిడ్ లైన్ పరీక్ష నిర్వహణను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనాన్ని అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.