భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి: మంత్రి
AP: వైసీపీ పాలనలో కార్మికుల భద్రత పట్ల చిత్తశుద్ధి లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయన్న వాసంశెట్టి.. రానున్న కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం మన రాష్ట్రానికి వచ్చే అవకాశాలు నిండుగా ఉన్నాయన్నారు.