స్నేహితుల మధ్య గొడవ.. కత్తితో దాడి
ప్రకాశం: పొన్నలూరు మండలం చవటపాలెంలో స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ధనుంజయ్ అనే వ్యక్తి హరిబాబు అనే స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో హరిబాబుకి తీవ్ర రక్తస్రావం కావడంతో అతన్ని కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ధనుంజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.