ఒంటిమిట్టకు 135 ప్రత్యేక బస్సులు

KDP: జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ఒంటిమిట్ట క్షేత్రానికి 135 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు జిల్లా రవాణా అధికారి గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన ఒంటిమిట్ట క్షేత్రంలో సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కడప 35, జమ్మలమడుగు 10, ప్రొద్దుటూరు 15, బద్వేలు 20 బస్సులు ఉంటాయన్నారు.