VIDEO: ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
WGL: నగరంలోని శ్రీ భద్రకాళి ఆలయంలో బుధవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తన జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికగా, వేద పండితులు ఆశీర్వాదాలు అందించారు. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.