వారిని అప్పుడే తీసుకురాలేం: కేంద్రం
ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను ఇప్పడే తీసుకురాలేమని మద్రాసు హైకోర్టుకు కేంద్రం వెల్లడించింది. వారిని ఏప్రిల్ 14 తర్వాతే తీసుకురావొచ్చని తెలిపింది. కన్యాకుమారికి చెందిన 88 మందితో సహా 600 మంది జాలర్లు ఇరాన్‌లో చిక్కుకుపోయారు. వారిని రక్షించాలని పిటిషన్ వేయగా.. దాని విచారణ సందర్భంగా కేంద్రం సమాధానం ఇచ్చింది.