VIDEO: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే
కోనసీమ: మామిడికుదురు మండలం అప్పనపల్లిలో బాల తిరుపతిగా పేరుగాంచిన అప్పనపల్లి బాలబాలాజీ స్వామి వారిని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోమవారం దర్శించుకున్నారు. దీపావళి సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్వామివారి దర్శనానికి విచ్చేశారు. వారికి ఆలయ మర్యాదలతో అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికి, స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.