నిజాంపల్లిలో పనిచేయని నిఘా నేత్రాలు

నిజాంపల్లిలో పనిచేయని నిఘా నేత్రాలు

BHPL: గోరికొత్తపల్లి (M) నిజాంపల్లిలో రూ. లక్షల ప్రజాధనం ఖర్చు చేసి ఏర్పాటు చేసిన CC కెమెరాలు గత రెండు సంవత్సరాలుగా పనిచేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెమెరాలు పనిచేయకపోవడం వల్ల గ్రామంలో అక్రమాలు, దొంగతనాలు పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి కెమెరాలను మరమ్మతు చేయించాలన్నారు.