ఈ నెల 2న శ్రీహరికోటకు ప్రత్యేక బస్సులు
KDP: శ్రీహరికోటలో నవంబరు 2న జరగనున్న శాటిలైట్ లాంచింగ్‌ను వీక్షించేందుకు బద్వేలు, పోరుమామిళ్ల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డీఎం చైతన్య నిరంజన్ తెలిపారు. పోరుమామిళ్ల నుంచి రూ.1000, బద్వేలు నుంచి రూ. 800 ఛార్జీతో బస్సులు నవంబర్ 2న ఉదయం 6 గంటలకు బయలుదేరుతాయి. చెంగాలమ్మ ఆలయం, నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం, పులికాట్ సరస్సు సందర్శించే అవకాశం కల్పించారు.