Video: 'కరువైన మౌలిక వసతులు'

SKLM: భామిని మండలంలోని జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో ఉన్న జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. వీటికి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అధికారులు కల్పించ లేదు. తక్షణం సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తు లైన్లు, తాగునీటి సదుపాయాలు కల్పించాలని అధికారులను లబ్ధిదారులు కోరుతున్నారు.