నేటి నుంచి రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నేటి నుంచి రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

అన్నమయ్య: చిట్వేలు మండలంలోని నగిరిపాడు పంచాయతీలో వెలసిన శ్రీ శ్రీ రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 27వ తేదీ వరకు 10 రోజులు పాటు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా.. ప్రతిరోజు పౌరాణిక నాటకాలు, పాట కచేరీలు, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కమిటీ సభ్యులు కోరారు.