ఎస్సైని సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘం

SDPT: బెజ్జంకి మండలంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎస్సై బోయిని సౌజన్యను శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆలయంలో ఎస్సై ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయ సమర్పించారు. వేద పండితులు అర్చనాధి కార్యక్రమాలను పూర్తి చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.