పీడీఎస్ బియ్యం పట్టివేత... ముగ్గురిపై కేసు నమోదు
MHBD: నరసింహులపేట మండలంలోని కొమ్ములవంచకు చెందిన గోపారం సోమ్మయ్య 9 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా, నెల్లికుదురు పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఆటోను తనిఖీ చేయగా 9 క్వింటాల రేషన్ బియ్యం లభ్యమయ్యాయి. బియ్యంతో పాటు ఆటోను సీజ్ చేసి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు పేర్కొన్నారు.