ఇస్కాన్ ఆలయం.. ఆధ్యాత్మిక అద్భుతం

రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో అనంతపురంలోని ఇస్కాన్ ఆలయం ఒకటి. 2008 ఫిబ్రవరిలో ఈ ఆలయం ప్రారంభించారు. ఆలయ నిర్మాణ శైలి అద్భుతమైన గుర్రపు రథం ఆకారంలో ఉండటంతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో భజనలతో భక్తులను ఆకట్టుకుంటుంది. పట్టణం నుంచి దూరంగా ఆధ్యాత్మికత, ప్రశాంతతకు అద్భుతమైన నిలయంగా మారింది.