కాలరుద్ర రూపంలో రామప్ప రామలింగేశ్వర స్వామి

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలో గల రామప్ప ఆలయంలోని రామలింగేశ్వర స్వామి సోమవారం కాళరుద్ర రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్ శర్మ స్వామివారికి అభిషేకం చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.