VIDEO: భారీ వర్షాలకు కూలిన మట్టి మిద్దె

KRNL: పాలకొలను గ్రామంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా మట్టి మిద్దె కూలిపోయింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పెద్దమల్లయ్య అనే వ్యక్తికి చెందిన మిద్దె కూలిపోవడంతో ఆయన ఆరుగురు కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. అదృష్టవశాత్తు, ఆ సమయంలో కుటుంబ సభ్యులు వేరే గదిలో ఉండటంతో ప్రాణనష్టం తప్పిందని తెలిపారు.