'రైతు నేస్తం యాప్‌లో అప్లోడ్ చేసుకోవాలి'
KNR: శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి స్రవంతి ఆదివారం నీట మునిగిన, నేలకొరిగిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రైతు భరోసా యాప్‌లో వివరాలు నమోదు చేశారు. అకాల వర్షానికి పంటలు నష్టపోవడంతో ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు అందించనున్నట్లు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతాంగం భారీగా నష్టపోయిందని పేర్కొన్నారు.