MLA గండ్ర స్వగ్రామంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం
భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వగ్రామమైన బుద్ధారంలో సర్పంచ్ పదవికి విడిదినేని శ్రీలత అశోక్ ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ దాఖలు చేసిన కొమ్మురాజు అమృతమ్మ, ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధికి మద్దతుగా తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం సాధ్యమైంది. గ్రామంలోని 12 వార్డుల్లో 9 వార్డులకు కూడా ఏకగ్రీవం పూర్తయింది.