మరింత బలహీనపడిన 'మొంథా' తుఫాన్
ఉత్తర ఛత్తీస్‌గఢ్ వద్ద అల్పపీడనంగా 'మొంథా' తుఫాన్ మరింత బలహీనపడింది. తీరం దాటాక 48 గంటలకుపైగా భూభాగంపై తీవ్ర ప్రభావం చూపిన మొంథా ఐదు రాష్ట్రాలపై ప్రభావం చూపింది. ఈనెల 25న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్‌గఢ్ భూభాగంపై అల్పపీడనంగా బలహీనపడింది. వారం రోజులుగా మొంథా బంగాళాఖాతాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.