VIDEO: లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ముడుపుల పూజలు
సీతానగరం లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ముడుపులు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం మన్యం జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి ఆలయం చుట్టూ గోవిందా, గోవిందా అంటూ ప్రదక్షిణలు చేపట్టి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముడుపు కట్టి 9 వారలు నియమ నిష్ఠలతో పూజలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.