'సీఎం పర్యటనను విజయవంతం చేయాలి'
VZM: ఈనెల 23న సీఎం చంద్రబాబు నక్కపల్లి పర్యటనపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి భారీ స్థాయిలో ప్రజలు తరలి వెళ్లేలా నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు.