వడదెబ్బపై అప్రమత్తం.. ఆరోగ్యశాఖ సూచనలు..!
GNTR: వేసవిలో వడదెబ్బ ప్రమాదం పెరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయలక్ష్మి హెచ్చరించారు. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు కారణమని తెలిపారు. చెమట రాకపోవడం, మగత, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లకుండా ఉండాలన్నారు. తేలికపాటి దుస్తులు ధరించాలని ఆమె సూచించారు.