'నియోజకవర్గం ప్రజలు సుఖశాంతులతో ఉండాలి'
MHBD: పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని తొర్రూరు ఏఎంసీ ఛైర్మన్ హనుమాన్ల తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు. సోమవారం ఏఎంసీ ఛైర్మన్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.