VIDEO: కోడూరులో ఊటీని తలపిస్తున్న పొగ మంచు
అన్నమయ్య: జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఇవాళ ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీనివల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణవాసులు ఈ దృశ్యాలను చూసి, కోడూరు ఊటీని తలపిస్తుందని, చుట్టుపక్కల పచ్చదనం,ఎంతో ఆహ్లాదం కలిగిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.