కాంగ్రెస్‌లో చేరిన విఠల్ నాయక్

VKB: తాండూరు బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్ తగలింది. వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సమక్షంలో హస్తం కండువా వేసుకున్నారు. విఠల్ నాయక్ నివాసంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి హస్తంలోకి ఆహ్వానించారు.