కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
TG: అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ BRS అధినేత KCRకు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. BRS సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్న దుష్ప్రచారానికి కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆ పార్టీ నేతలపై సివిల్, క్రిమినల్ కేసులు పెడతానని సీతక్క హెచ్చరించారు.