ధర్నా నిర్వహించిన అంగన్వాడీలు

W.G: అంగన్వాడీలకు సమ్మె కాలపు ఒప్పందాలు, కనీస వేతనం రూ. 26వేలు వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్, జిల్లా శ్రామిక నాయకులు అడ్డగర్ల అజయ కుమారి డిమాండ్ చేశారు. గురువారం తణుకు వెంకటేశ్వర ధియేటర్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ ధర్నా, ర్యాలీ నిర్వహించారు.