'రిజర్వాయర్ ముంపు నిర్వాసితులకు న్యాయం చేస్తాం'
KNR: గంగాధర మండలం మధురా నగర్ లోని ప్రజా కార్యాలయంలో శుక్రవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను నారాయణపూర్ గ్రామస్తులు కలిశారు. నారాయణపూర్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకొని న్యాయం చేస్తామని గ్రామస్తులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నారాయణపూర్ గ్రామస్తులను దశలవారీగా ఆదుకుంటామన్నారు.